రైతుల అభివృద్ధే ప్రభుత్వం లక్ష్యం: మంత్రి నిరంజన్ రెడ్డి

వనపర్తి: తెలంగాణా రాష్ట్రంలో రైతుల అభివృద్ధే లక్ష్యం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. పెద్దమందడి మండలం పామిరెడ్డి పల్లి శివారులో మల్రెరెడ్డి కుంటకు సాగునీటి అందించటానికి బుద్దారం కుడి కాలువకు 25 హెపీ మోటారును ఏర్పాటు చేశారు. ఈ మోటారును మంత్రి, కలెక్టర్ శ్వేతా మహంతితో కలిసి ప్రారంభించారు.



ఈ సందర్బంగా మంత్రి మాట్లాడుతూ ఎత్తు ప్రాంతంలో ఉన్న పొలాలకు మోటార్ల సహాయంతో అదిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మేఘారెడ్డి, మండల రైతు సమితి అధ్యక్షులు రాజా ప్రకాష్ రెడ్డి, పామిరెడ్డిపల్లి సర్పంచ్ సిద్ధయ్య, చీకురు చెట్టు తండా సర్పంచ్ రాధాకృష్ణ, ఎంపీటీసీ ఇందిరమ్మ, మాజీ జడ్పీటీసీ వెంకట్ స్వామి, నాయకులు తదితరులు పాల్గొన్నారు...